జమ్మికుంట, వెలుగు: సీఎం కేసీఆర్10 ఏండ్ల పాలనలో ప్రశ్నాపత్రాలను లీక్చేస్తూ యువతకు ఉద్యోగాలివ్వలేదని హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వొడితెల ప్రణవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం, పాత వ్యవసాయ మార్కెట్, సువర్ణ ఫంక్షన్ హాల్, కృష్ణ కాలనీల్లో మాట్లాడారు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ఉద్యోగాలివ్వకుండా నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు కారణమైందన్నారు.
20 ఏండ్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఆయన బీజేపీ నుంచి రెండు చోట్లా నామినేషన్లు వేసి గజ్వేల్‌లో అక్కడి బిడ్డనని, హుజూరాబాద్ లో ఇక్కడి బిడ్డనంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ఖర్చు కోసం మోత్కులగూడెం గ్రామానికి చెందిన చిన్నారులు తమ ప్యాకెట్‌మనీని ప్రణవ్‌కు అందజేశారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మెటి సమ్మిరెడ్డి, దాసరి భూమయ్య, పొనగంటి మల్లయ్య, మొలుగూరి సదయ్య, పత్తి కృష్ణారెడ్డి ఉన్నారు.