ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ Odysse..ఇండియాలో కొత్తగా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. Odysse Snap హైస్పీడ్ ఎలక్ట్రిక్ కాగా మరొకటి Odysse E2 తక్కువ స్పీడ్ గల ఈ స్కూటర్. ఈ కంపెనీ వాడెర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ విడుదల చేసిన తర్వాత ఈ కొత్త స్నాప్ బ్రాండ్ రెండో ప్రధాన లాంచ్ ఇది. SNAP హై-స్పీడ్ స్కూటర్ ఉల్లాసకరమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.పట్టణ ప్రాంతాల్లో ప్రయాణానికి మంచి అనుకూలమైన స్కూటర్.
Odysse స్నాప్ ఎలక్ట్రిక్ హైస్పీడ్ స్కూటర్.. 2వేల వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 60 kmph వేగంతో ప్రయాణిస్తుంది. ఈ హైస్పీడ్ ఈ స్కూటర్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 105 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. Snap వాటర్ రెసిస్టెంట్ కలిగిన IP67 రేటెడ్ మోటార్, AIS 156 సర్టిఫైడ్ LFP బ్యాటరీని కలిగి ఉంటుంది.
Odysse స్నాప్ హైస్పీడ్ స్కూటర్ లో లేటెస్ట్ టెక్నాలజీతో CAN డిస్ ప్లే ఉంటుంది. ఇందులో క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉుంటుంది.
మరోవైపు Odysse E2 తక్కువ స్పీడ్ స్కూటర్.. ఇది 250 వాట్ల మోటార్ శక్తిని కలిగి ఉంటుంది. 25kmph గరిష్ట వేగంతో నడుస్తుంది.ఒకసారి ఛార్జింగ్ పెడితే 70 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. E2 లోస్పీడ్ మోడల్ భద్రత,స్థిరత్వానికి ప్రాధాన్యతనిస్తూ పట్టణ ప్రయాణికుల కోసం రూపొందించబడింది.తక్కువ పర్యావరణ ప్రభావంతో అవాంతరాలు లేని పట్టణ ప్రయాణాన్ని అందిస్తుంది.
Odysse స్నాప్ హైస్పీడ్ స్కూటర్ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం.. అయితే E2 స్కూటర్ నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అయితే ఈ రెండు వాహనాలకు హెల్మెట్ తప్పనిసరి.
కొత్త ఒడిస్సీ స్పాప్ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 79,999 కాగా.. E2 తక్కువ స్పీ్ ఈ స్కూటర్ దర రూ. 69,999 మాత్రమే. ఇది షోరూమ్ ధర.