Bibek Debroy: ప్రధానిమోదీ ఆర్థిక సలహాదారు బిబేక్ దెబ్రాయ్ మృతి

Bibek Debroy: ప్రధానిమోదీ ఆర్థిక సలహాదారు బిబేక్ దెబ్రాయ్ మృతి

ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానిమోదీ ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్(69) శుక్రవారం( నవంబర్1) కన్నుమూశారు.దెబ్రాయ్ భారత ఆర్థిక విధానం, అనేక పరిశోధనల చేసిన ఆర్థికవేత్తలో ఒకరు. పేగు సంబంధిత వ్యాధితో ఢిల్లీలో AIIMS ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం మృతి చెందారు. 

దెబ్రాయ్ సెప్టెంబర్ 2027 నుంచి ప్రధానమంత్రి మోదీకి ఆర్థిక సలహామండలి చైర్మన్ గా పనిచేస్తున్నాడు. అదనంగా అమృత్ కాల్ కోసం మౌలిక సదుపాయాల వర్గీక రణ, ఫైనాన్సింగ్ ఫ్రేమ్ వర్క్ కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీకి అధ్యక్షత వహించారు. 

బిబేక్ దెబ్రాయ్ ప్రధాని మోదీ నివాళులర్పించారు. డెబ్రాయ్ తన రచనల ద్వారా భారత దేశపు మేథో రంగంపై చెరగని ముద్ర వేశారని సోషల్ మీడియా ప్లాట్ ఫాంX లో పోస్ట్ చేశారు.

దెబ్రాయ్ కన్సల్టింగ్ ఎడిటర్‌గా పనిచేశాడు. భారతదేశంలోని అనేక ప్రముఖ ఆర్థిక ప్రచురణలకు సహకారం అందించారు.  అతని సేవలకు గుర్తింపుగా 2015లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డు వరించింది. ఎకనామిక్స్ , పబ్లిక్ పాలసీలో ఆయన చేసిన కృషికి పలు గౌరవ డిగ్రీలు , అవార్డులతో సత్కరించారు.
 
గేమ్ థియరీ, ఎకనామిక్ థియరీ, ఆదాయం ,సామాజిక అసమానతలు, పేదరికం, చట్ట సంస్కరణలు, రైల్వే సంస్కరణలు ,ఇండాలజీ మొదలైన వాటికి డెబ్రాయ్ గణనీయమైన కృషి చేశారు.