
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) 56 ఏరోనాటికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 35 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.upsc.gov.in లో సంప్రదించాలి.