
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 291 ఆఫీసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. వీటిలో జనరల్ ఆఫీసర్ పోస్టులు 222, డీఈపీఆర్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్) పోస్టులు 38, డీఎస్‌ఐఎం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్) పోస్టులు 31 ఉన్నాయి.
సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థులను మూడు దశల్లో- (ఫేజ్-1 - ప్రిలిమ్స్, ఫేజ్-2 - మెయిన్స్, ఇంటర్వ్యూ) ఎంపిక చేస్తారు. జనరల్ పోస్టులకు ప్రిలిమ్స్ అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్స్, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అయితే డీఈపీఆర్, డీఎస్‌ఐఎం పోస్టులకు మాత్రం మూడు దశల్లో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
అర్హతలు: జనరల్ పోస్టుల విద్యార్హత (01.05.23 నాటికి): ఏదైనా డిగ్రీ (60 శాతం) లేదా పీజీ (55 శాతం). ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు - డిగ్రీ (50 శాతం) లేదా పీజీ పాస్ కావాలి. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హులైన అభ్యర్థులు జూన్ 9 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.rbi.org.in వెబ్సైట్లో సంప్రదించాలి.