పూణె ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. మొత్తం 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్లైన్లో ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవాలి. జనరలిస్ట్ ఆఫీసర్లు స్కేల్-2: ఇందులో 400 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. జనరలిస్ట్ ఆఫీసర్లు స్కేల్-3: ఈ పోస్టుకు100 ఖాళీలు ఉన్నాయి. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. 25 నుంచి 38 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్
ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షని మొత్తం 150 మార్కులకి ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. ఫిబ్రవరి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష మార్చి 12వ తేదీని నిర్వహిస్తారు.
వెబ్సైట్: bankofmaharashtra.in