
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్ శాఖల్లో 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 1 నుంచి 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు: రిస్క్ ఇంజినీర్– 36, ఆటోమొబైల్ ఇంజినీర్లు– 96, లీగల్– 70, అకౌంట్స్– 30, హెల్త్– 75, ఐటీ– 23, జనరలిస్ట్స్ పోస్టులు 120 అందుబాటులో ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో ఆగస్టు 1 నుంచి ఆగస్టు 21 వరకు అప్లై చేసుకోవాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. పూర్తి వివరాలకు www.newindia.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.