శనగ పంట తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి : పుల్లయ్య

బజార్​హత్నూర్, వెలుగు: శనగ పంట తెగుళ్ల నివారణకు జాగ్రత్తలు పాటిస్తూ పంటను కాపాడుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య రైతులకు సూచించారు. బజార్​హత్నూర్​ మండలంలోని పలు గ్రామాల్లో సాగవుతున్న శనగ పంటను మంగళవారం మండల వ్యవసాయ విస్తీర్ణాధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో రైతులు శనగ పంటను అత్యధికంగా పండిస్తున్నారని, కొన్నిచోట్ల పంటకు పచ్చ పురుగుతో పాటు లద్దె పురుగు సోకిందన్నారు.

వీటి నివారణకు నోవాల్యురాన్, ఇమామెక్టిన్ బెంజోయేట్ మందులను పిచికారీ చేయాలని సూచించారు. వాతావరణంలోని మార్పుల కారణంగా పంటకు ప్రస్తుతం తెగుళ్లు సోకే అవకాశం ఉందని, నివారణకు మేటలక్సిల్+మంకోజెబ్ మందులను పిచికారి చేసుకోవాలన్నారు. క్లస్టర్ ఏఈఓలు రామ్, రాజేశ్వర్, రైతులు ఉన్నారు.