- కాంట్రాక్టర్లులకు అనుగుణంగా సరుకుల రేట్లు
- డైట్లో గుడ్డు, పాలు, పండ్లు ఎగ్గొట్టినట్టే!
- కిరాణం సామాన్ల వైపే మొగ్గు.. కూరగాయల్లో కోత
- పౌష్టికాహారానికి దూరం కానున్న విద్యార్థులు
గురుకులాలు, కేజీబీవీలు, మోడల్స్కూల్స్ను సెట్ చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే.. జిల్లా అధికారులు మాత్రం అంతకంటే ముందే కాంట్రాక్టర్లతో సెట్చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. కాంట్రాక్టర్లతో చేతులు కలిపి తలాతోకలేని రేట్లను ఫిక్స్ చేయడంతో ఈ ఏడాది కూడా స్టూడెంట్స్కు ఆకలి కష్టాలు తప్పేలా లేవు.
నల్గొండ, వెలుగు: కేజీబీవీలు, మోడల్స్కూల్స్ విద్యార్థులకు నెలకు ఒక్కొక్కరికి రూ.1225 చొప్పున డైట్చార్జీలను ప్రభుత్వం ఫిక్స్ చేసింది. బీసీ, ఎస్సీ గురుకులాల్లో ఏడో తరగతి వరకు రూ.950, 8,9,10 తరగతులకు రూ.1100లు చెల్లిస్తోంది. అంటే సగటున ప్రతి రోజు కేజీబీవీ స్టూడెంట్స్కు రూ.40 కాగా, బీసీ, ఎస్సీ గురుకులాల్లో పిల్లలకు రూ.31 నుంచి రూ.36 మాత్రమే ఖర్చు పెట్టాలి.
ఈ పైసలతోనే కిరాణం, పాలు, పండ్లు, కూరగాయలు, చికెన్, మటన్, గుడ్డు సప్లై చేయాలి. వీటిని సప్లై చేసేందుకు ప్రతి ఏడాది జిల్లా కొనుగోలు కమిటీ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి, తక్కువ కోట్ చేసిన వారికి కాంట్రాక్టు ఇస్తుంటారు. గత కొన్నేళ్ల నుంచి ఈ రేట్లు గిట్టుబాటు కావట్లేదని గుడ్డు, మటన్, చికెన్ పెట్టడం తగ్గించారు. పప్పు, నీళ్ల చారు తప్పా పౌష్టికాహారం అందించలేకపోతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్దాపూర్ ఘటనపై తీవ్రంగా స్పందించడానికి కారణం కూడా ఇదే.
మార్కెట్లో ఏది చౌకగా లభిస్తే దాన్నే..
ప్రభుత్వం ఫిక్స్చేసిన ఈ డైట్ చార్జీలకు లోబడే అన్ని రకాల ఐటమ్స్రేట్లను కొనుగోలు కమిటీ నిర్ణయిస్తోంది. బడ్జెట్చాలకపోవడంతో కిరాణం, కూరగాయలు, ఫ్రూట్స్లో కొన్ని ఐటమ్స్కు రేట్లు పెంచి, మిగతా వాటికి కేజీ రూపాయి, రెండు రూపాయిలే ఫిక్స్ చేస్తున్నారు. దీన్నే సాకుగా చూపిస్తున్న కాంట్రాక్టర్లు అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. అసలు ఫిక్స్చేసిన మోనూ మొత్తం పక్కదారి పట్టించి, మార్కెట్లో ఏది చౌకగా లభిస్తే దాన్ని సప్లై చేస్తున్నారు. దీంట్లో పలువురు అధికారులు, ప్రిన్సిపాల్స్ ప్రమేయంతో మొత్తానికి మొత్తమే విద్యార్థులు నష్టపోతున్నారు.
ఈ ఏడాది విద్యార్థులకు మరింత నష్టం
నల్గొండ జిల్లాలోని మోడల్స్కూల్స్, కేజీబీవీల్లో కిరాణం టెండర్లలో గోల్మాల్చేసిన ఆఫీసర్లు.. కూరగాయాలు, పండ్లు, మటన్ రేట్లలో భారీగా కోత పెట్టారు. ప్రభుత్వం ఫిక్స్చేసిన డైట్బడ్జెట్లో సగానికి పైగా కిరాణం సామాన్లకే కేటాయించారు. కూరగాయలను కేజీ రూ.23లకే పరిమితం చేయగా, పాలు, గుడ్లు రేట్లు గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఈ వర్క్ఆర్డర్ కాపీనే ఇప్పుడు బీసీ, ఎస్సీ గురుకులాల్లో వర్తింప చేయాలని చూస్తున్నారు.
పైఆఫీసర్ల నుంచి ఒత్తిళ్లు!
ఇందుకు పైఆఫీసర్లు ఒత్తిడి చేశారని, అందుకు ఒప్పుకోకపోవడంతో కాంట్రాక్టర్లు ఆఫీసుకు వచ్చి బెదిరించారని గురుకుల ఆఫీసర్లు అంటున్నారు. తమ డిపార్ట్మెంట్వరకు సపరేట్గా టెండర్లు పిలుస్తామని చెప్పినా వినకుండా మైనార్టీ, ఎస్సీ, బీసీ గురుకులాలు అన్ని కలిపి ఒకటే నోటిఫికేషన్ఇచ్చారన్నారు. కిరాణం, కూరగాయలు, ఫ్రూట్స్, పాలు, గుడ్లు అన్నింటికి కలిపి ఉన్న బడ్జెట్లోనే నెగోషియేషన్ చేసినట్లయితే అన్ని ఐటమ్స్ కు రేట్లు గిట్టుబాటు ధర లభించేది. కానీ మొత్తం రూ.1225లో రూ.7 – 8 వందలు కిరాణం సామాన్లకే పోతోందని, రెండు, మూడొందలు మాత్రమే కూరగాయలకు వస్తాయని, ఇక ఫ్రూట్స్లో అరటి పండు తప్పా మరేవి సప్లై చేయరని కేజీబీవీ ఆఫీసర్లు చెబుతున్నారు. దీని వల్ల విద్యార్థులకు ఈ ఏడాది కూడా మోనూ పాటించడం కష్టమవుతుందని అంటున్నారు.