ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆఫీసర్ల బడి బాట

 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆఫీసర్ల బడి బాట
  • స్కూళ్లు, హాస్టళ్లలో పిల్లల భోజనం పరిశీలన, కిచెన్లలో తనిఖీలు
  • కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డీఈవోలు, ఎంఈవోల ఆకస్మిక పర్యటనలు 
  • అప్రమత్తమవుతున్న వంట ఏజెన్సీల నిర్వాహకులు 

కరీంనగర్, వెలుగు: సర్కార్ స్కూళ్లు, హాస్టళ్లలో భోజనంలో నాణ్యత లోపించడం, అన్నం ముద్దగా అవుతున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తుండడంతో ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డీఈఓలు బడి బాట పట్టారు. స్కూళ్లు, హాస్టళ్లలో కిచెన్లను పరిశీలిస్తూ వంట చేసేవారికి, టీచర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

ఎంఈవోలు విధిగా రోజుకో స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించాలని, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఇప్పటికే ఆదేశించారు. వంట సరుకుల స్టోర్ రూమ్, రికార్డులు పరిశీలించి  నాణ్యత పాటిస్తున్నారో.. లేదో చూడాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లను కూడా పర్యవేక్షించాలని ఆదేశించారు. దీంతో డీఈవోతోపాటు అన్ని మండలాల్లో ఎంఈఓలు స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

హాస్టళ్లు, స్కూళ్లలో ఆఫీసర్ల ఆకస్మిక తనిఖీలు.. 

ఈ నెల 25న రాత్రి కరీంనగర్ లోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ సందర్శించారు. కిచెన్ ను సందర్శించి సరకులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓల్డ్ హైస్కూల్, హుజూరాబాద్ లోని గవర్నమెంట్ హైస్కూల్ ను డీఈవో జనార్దన్ రావు సందర్శించారు. ఓల్డ్ హైస్కూల్ కిచెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలుకలు తిరగడం, రాగి జావాలో పురుగులు ఉండడం చూసి హెచ్ఎం, స్టోర్ ఇన్ చార్జి, ఫిజికల్ డైరెక్టర్ ను సంజాయిషీ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. హెచ్ఎం, టీచర్లు భోజనం చేశాకే పిల్లలకు వడ్డించాలని అన్ని స్కూళ్ల హెచ్ఎంలను డీఈఓ ఆదేశించారు. 

మంథని మండలంలో కలెక్టర్ తనిఖీ 

మంథని/ వేములవాడరూరల్/ రాయికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష, డీఆర్డీవో  రవీందర్ ఆదేశించారు. గురువారం మంథని మండలం నాగారం, కన్నాల, గుంజపడుగు గ్రామాల్లోని ప్రైమరీ, జడ్పీ హైస్కూళ్లను పరిశీలించారు. మధ్యాహ్న భోజన తయారీకి క్వాలిటీ పదార్థాలనే వాడాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి స్కూల్​లో సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ముత్తారం మోడల్ స్కూల్ ను డీఆర్డీవో రవీందర్ తనిఖీ చేశారు.

ALSO READ : ఎన్ఐసీకి ధరణి చిక్కులు!. భూముల డేటా మొత్తం ప్రైవేట్ ​ఏజెన్సీ చేతుల్లోనే

వేములవాడ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంఈవో బన్నాజీ తనిఖీలు చేపట్టారు. కిచెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిసరాలను పరిశీలించారు. రాయికల్ మండలం జగన్నాథ్​పూర్​ బాలికల గిరిజన ఆశ్రమ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబ్దుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖయ్యూం, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ దేవదాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి భోజనం
 చేశారు.