
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో పరిషత్ ఎన్నికల కోసం ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో రోజూ ఏమేం పనులు చేస్తున్నారో పై అధికారులకు నివేదిక సమర్పిస్తున్నారు. షెడ్యూల్ విడుదలయ్యే నాటికి ఎన్నికల నిర్వహణకు రెడీ కానున్నారు. ఎలక్షన్ స్టాఫ్ మొదటి ర్యాండమైజేషన్ కూడా పూర్తి చేశారు. జిల్లాలోని ఎంపీటీసీ స్థానాలు, పోలింగ్ సెంటర్లు, ఓటర్ ముసాయిదా లిస్టును ఈ నెల11న ప్రకటించారు. అభ్యంతరాలు ఉంటే స్వీకరించి 15న ఫైనల్ చేస్తారు.
31 మండలాలు.. 307 ఎంపీటీసీలు
కొత్తగా ఏర్పడిన సాలూరా, పోతంగల్, డొంకేశ్వర్, ఆలూర్ కలిపి జిల్లాలో మొత్తం 31 మండలాలలో ప్రాదేశిక ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల సంఖ్య 8,51,770 కాగా అందులో మహిళలు 4,54,613 ఓటర్లు, పురుషులు 3,97,140, ఇతరులు 17 మంది నమోదయ్యారు. కనీసం 400 నుంచి 750 ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఉండేలా మొత్తం 1,564 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సుమారు ఆరు వేల మంది సిబ్బందిని నియమించనున్నారు. 17 ఎంపీటీసీ స్థానాలు, 47,573 ఓటర్లతో డిచ్పల్లి జిల్లాలో పెద్ద మండలంగా, 16 ఎంపీటీసీ, 46,871 ఓటర్లతో నవీపేట మండలం సెకెండ్ ప్లేస్లో ఉంది. ఐదు ఎంపీటీసీ స్థానాలు, 9,092 ఓటర్లతో చందూర్ మండలం చిన్న మండలంగా గుర్తింపు పొందింది.
పరిషత్ స్థానాల వివరాలు
మండలం ఎంపీటీసీలు ఓటర్లు
ఆలూర్ 9 24,022
ఆర్మూర్ 11 30,595
బాల్కొండ 9 25,804
భీంగల్ 14 39,130
బోధన్ 11 31,210
చందూర్ 5 9,092
ధర్పల్లి 11 32,398
డిచ్ పల్లి 17 47,573
డొంకేశ్వర్ 7 16,866
ఇందల్వాయి 11 30,908
జక్రాన్ పల్లి 13 35,423
కమ్మర్ పల్లి 10 29,791
కోటగిరి 7 19,081
మాక్లూర్ 11 30,959
మెండోరా 8 21,117
మోర్తాడ్ 10 27,485
మోస్రా 5 10,393
మోపాల్ 11 30,657
ముప్కాల్ 6 16,265
నందిపేట 15 42,443
నవీపేట 16 46,871
నిజామాబాద్ 8 21,917
పోతంగల్ 8 21,705
రెంజల్ 11 29,845
రుద్రూర్ 6 17,958
సాలూరా 7 17,649
సిరికొండ 12 34,194
వర్ని 9 27,033
వేల్పూర్ 13 37,317
ఎడపల్లి 11 31,608
ఎర్గెట్ల 5 14,46