గత ఐదేండ్లలో జడ్పీ మీటింగ్ ​లను లైట్ తీసుకున్రు

గత ఐదేండ్లలో జడ్పీ మీటింగ్ ​లను  లైట్ తీసుకున్రు
  • 20కిపైగా సమావేశాలు జరిగితే..  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అటెండ్ కానివే ఎక్కువ 
  • ఐదేండ్లలో జడ్పీకి వచ్చింది  రూ. 23కోట్లే.. ఖర్చు చేసింది రూ.15 కోట్లు మాత్రమే.. 
  • జిల్లా పరిషత్​లను బీఆర్ఎస్ సర్కార్ నిర్వీర్యం చేసిందనే ఆరోపణలు 
  • ఈ నెలాఖరున చివరి జడ్పీ మీటింగ్ నిర్వహణకు  ఆఫీసర్ల ఏర్పాట్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ సమావేశాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్​లకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. కానీ భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని జడ్పీ మీటింగ్​లకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా వరకు డుమ్మా కొట్టారు. కాగా ఈ నెలాఖరున చివరి జడ్పీ మీటింగ్​ నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 

  • పాలకవర్గం పదవీ కాలం గడువు ఇంకా రెండు వారాలే.. 

ఆగస్టు 7న జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ఈ నెలాఖరున చివరి జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్​ నిర్వహించేందుకు జడ్పీ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 21 మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు తమ ప్రాంతాల్లోని ప్రధాన సమస్యలను ఆఫీసర్ల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు జనరల్ బాడీ మీటింగ్​లు ఎంతగానో దోహదపడుతాయి. జడ్పీ మీటింగ్​లో జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ స్థాయిలో చర్చించడం, సీఎం, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశాలున్నాయి. కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాలేదు. దీంతో  పలు మీటింగ్​ల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలో పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • గత సర్కారు జడ్పీలను నిర్వీర్యం చేసింది..

ఐదేండ్లలో జిల్లా పరిషత్​ను గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వీర్యం చేసిందని పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆరోపిస్తున్నారు. తాము పేరుకే ఉన్నామని, ఒక్క పని కూడా తమ పరిధిలోని గ్రామాల్లో చేయలేకపోయమని జడ్పీటీసీలు అసంతృప్తి వ్యక్తం  చేస్తున్నారు. గ్రామాలే పట్టుగొమ్మలని పేర్కొన్న గత సీఎం కేసీఆర్ తన పదవీ కాలంలో జడ్పీలకు ఫండ్స్ ఇవ్వకుండా ఆగం చేశారని పలువురు 
విమర్శిస్తున్నారు.

  • ఐదేండ్లలో కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చింది రూ. 23 కోట్లే..

గత ఐదేండ్లలో జిల్లా పరిషత్​కు వచ్చింది కేవలం రూ. 23 కోట్లే. రూ.10.61కోట్లు కేంద్రం షేర్ కాగా, రాష్ట్రం నుంచి పలు స్కీం కింద వచ్చిన గ్రాంట్స్ దాదాపు రూ. 12.64కోట్లు. అయితే వచ్చిన రూ. 23 కోట్లలో ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది రూ.15కోట్లే కావడం గమనార్హం. 

  • ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల అటెండ్ అయిన వివరాలు

ప్రజాప్రతినిధిపేరు    హోదా    జరిగిన మీటింగ్లు    అటెండ్ అయినవి       నామా నాగేశ్వరరావు      ఎంపీ     24    01
మాలోత్ కవిత    ఎంపీ    24     01
బాలసాని లక్ష్మీనారాయణ    ఎమ్మెల్సీ    12    04
తాతా మధు    ఎమ్మెల్సీ    12    02
ఎ.నర్సిరెడ్డి     ఎమ్మెల్సీ    24    05
పల్లె రాజేశ్వర్​రెడ్డి    ఎమ్మెల్సీ    23    00
వనమా వెంకటేశ్వరరావు    ఎమ్మెల్యే    22    03
రాములు నాయక్    ఎమ్మెల్యే    22    01
రేగా కాంతారావు    ఎమ్మెల్యే     22    09
భానోత్ హరిప్రియ    ఎమ్మెల్యే    22    05
మెచ్చా నాగేశ్వరరావు    ఎమ్మెల్యే     22          03
పొదెం వీరయ్య    ఎమ్మెల్యే     22    01