దెబ్బతిన్న రాళ్లవాగు బ్రిడ్జి పరిశీలన : జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌‌రెడ్డి

ములుగు, వెలుగు : భారీ వర్షంతో దెబ్బతిన్న ములుగు మండలం బండారుపల్లి శివారులోని రాళ్లవాగు బ్రిడ్జిని ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌‌రెడ్డి విమర్శించారు. దీని వల్ల రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేశ్‌‌ యాదవ్‌‌ ఆధ్వర్యంలో శుక్రవారం బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా భాస్కర్‌‌రెడ్డి మాట్లాడుతూ బ్రిడ్జి దెబ్బతిని వారం రోజులు దాటినా రిపేర్లు చేయకపోవడం సరికాదన్నారు.

బండారుపల్లితో పాటు పస్రా, నార్లాపూర్, జలగలంచ బ్రిడ్జిలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. ఆఫీసర్లు స్పందించి రిపేర్లు చేపట్టాలని డిమాండ్‌‌ చేశారు. ఆయన వెంట నియోజకవర్గ కన్వీనర్​సిరికొండ బలరాం, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్య జవహర్‌‌లాల్‌‌, ప్రచార కార్యదర్శి డి.రవిరెడ్డి, నాయకులు అన్నపురెడ్డి ప్రమోద్‌‌రెడ్డి, సూర్యదేవర విశ్వనాథ్, యువమోర్చ జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, వెంకటాపూర్‌‌ మండల అధ్యక్షుడు కారుపోతుల యాదగిరి, సురేశ్‌‌ పాల్గొన్నారు.