కొత్తగూడెంలో రైఫిల్ ​షూటింగ్​ సెంటర్​

కొత్తగూడెంలో  రైఫిల్ ​షూటింగ్​ సెంటర్​
  • హైదరాబాద్​ తర్వాత రెండో శిక్షణా కేంద్రం 
  • నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్న స్టూడెంట్స్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలో రైఫిల్​షూటింగ్  ట్రైనింగ్​ సెంటర్​ ఏర్పాటుకు ఆఫీసర్లు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్​ తర్వాత కొత్తగూడెంలో ఏర్పాటు చేసేది రెండో శిక్షణా కేంద్రం కావడం విశేషం. రైఫిల్​ షూటింగ్​ ట్రైనింగ్​ సెంటర్​ ఏర్పాటుకు సంబంధించి కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​​రూ. 3.5లక్షలు శాంక్షన్​  చేశారు. శ్రీరామచంద్ర డిగ్రీ కాలేజీలో థియరీ క్లాసెస్​కు గానూ రూమ్​లు కేటాయించారు. 

గన్స్​, పిస్టల్స్​తో పాటు ఇతరత్రా సామగ్రి ఏర్పాటు చేశారు. ఈ ట్రైనింగ్​ సెంటర్​లో చేరేందుకు పలువురు స్టూడెంట్స్​ ఆసక్తి చూపుతున్నారు. మొదటి దశలో ఐదుగురు బాయ్స్​, ఐదుగురు గర్ల్స్​ను సెలెక్ట్​ చేసేలా ప్లాన్​ చేశామని యువజన, క్రీడల శాకాధికారి పరంధామరెడ్డి పేర్కొన్నారు. రైఫిల్​ షూటింగ్​ సెంటర్​ కోసం అడిగిన వెంటనే కలెక్టర్​ స్పందించి ఫండ్స్​ను శాంక్షన్​ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఉద్యోగాల్లో రిజర్వేషన్లు..

రైఫిల్​ షూటింగ్​లో ప్రతిభ చూపే వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్మీ, పోలీస్, స్పెషల్ ఫోర్స్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, నావీ, ఎయిర్​ పోర్టు సెక్యూరిటీ ఇతరత్రా యూనిఫాం సర్వీస్​ లలో రైఫిల్​ షూటింగ్​లలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన వారికి మంచి రిజర్వేషన్లు ఉన్నాయని పలువురు సీనియర్​ క్రీడాకారులు పేర్కొంటున్నారు. 

గోల్డ్ ​మెడలిస్ట్ ​ఆధ్వర్యంలో..

రాష్ట్ర స్థాయిలో రెండు సార్లు గోల్డ్​ మెడల్​ సాధించిన కొత్తగూడెం పట్టణానికి చెందిన అబ్దుల్​ నబి మహ్మద్​ రైఫిల్​షూటింగ్​సెంటర్​కోచ్​గా వ్యవహరించనున్నారు. జాతీయ స్థాయిలో రైఫిల్​షూటింగ్​లోనూ పాల్గొనడంతో పాటు ముంబాయిలోని అంతర్జాతీయ తాజ్​హోటల్​లో ఇంటిలిజెన్స్​ఆఫీసర్​గా ఆయన పనిచేశారు. ఇటీవలకొత్తగూడెంకు వచ్చిన ఆయన యువతకు రైఫిల్​ షూటింగ్​పై ఆసక్తి కలిగించడంతో పాటు వారికి ట్రైనింగ్​ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే యువజన, క్రీడల శాఖాధికారులను సంప్రదించారు. 

స్పందించిన యువజన, క్రీడల శాఖాధికారి కలెక్టర్ తో మాట్లాడి సెంటర్​ను ఏర్పాటు చేశారు. త్వరలో ట్రైనింగ్​సెంటర్​ను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి దశలో స్పోర్ట్స్​ ఎయిర్​ రైఫిల్స్​తో పాటు స్పోర్ట్స్​ పిస్టల్స్​తో శిక్షణ ఇవ్వనున్నట్టు కోచ్​తెలిపారు.