జగిత్యాల, వెలుగు : కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని కొందరు అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తుండగా కొందరు ఆఫీసర్లు రీల్స్ చూస్తూ, గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేయడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు జిల్లా అధికారులు హాజరుకావాల్సి ఉండగా కొందరు.. కిందిస్థాయి జూనియర్, సీనియర్ ఆసిస్టెంట్లు, ఏవోలను పంపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.