సివిల్ సప్లై గోదాంలో  అధికారుల తనిఖీలు 

చౌటుప్పల్, వెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని సివిల్ సప్లై గోదాంపై పౌర సరఫరాలశాఖ విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజిలెన్స్ డీఎస్సీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో తనిఖీలు  నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తనిఖీల్లో సకాలంలో రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా చేయడం లేదని తేలిందన్నారు. రేషన్ డీలర్లకు బియ్యం సప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా డీలర్ల సంతకం, వేలిముద్రలు తీసుకోవాలని, అలా కాకుండా రూల్స్ కు విరుద్ధంగా లారీలు లోడ్ చేసి పంపించడం సరికాదన్నారు.