కలెక్టర్ వెంకటరావుకు అధికారుల సన్మానం

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా సుమారు 17 నెలల పాటు పనిచేసి బదిలీపై వెళ్తున్న ఎస్.వెంకట రావుకు జిల్లా యంత్రాంగం వీడ్కోలు పలికింది. సూర్యాపేట నూతన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆధ్వర్యంలో ఆదివారం ఆయనను రెవెన్యూ అధికారులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ... ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ఎక్కడ సమస్య తలెత్తిన వెంటనే అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేసిన మీడియాను అభినందించారు.