
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఆఫీసర్ స్కేల్ 2, 3 ఖాళీల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
ఖాళీలు: ఆఫీసర్ స్కేల్-3 పోస్టులు 100, ఆఫీసర్ స్కేల్-2 ఉద్యోగాలు 300 ఉన్నాయి. 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25 నుంచి 38 ఏండ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సిలబస్, సెలెక్షన్ ప్రాసెస్ సంబంధించిన సమాచారం నోటిఫికేషన్లో ఇచ్చారు. వివరాలకు www.bankofmaharashtra.in వెబ్సైట్లో సంప్రదించాలి.