కామారెడ్డి, వెలుగు: మాచారెడ్డి మండలం మంథని దేవునిపల్లి శివారులో మైనింగ్ ఏరియాలను గురువారం ఆఫీసర్లు పరిశీలించారు. మైనింగ్తవ్వకాలతో తమ ఇండ్లు, బోరుబావులు దెబ్బతింటున్నాయని కొందరు స్థానికులు ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు.
ఉన్నతాధికారులతో ఆదేశాలతో ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, మైనింగ్ఆఫీసర్లు పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మైనింగ్క్వారీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆఫీసర్లను కోరారు.