పెనుబల్లి, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు ఆఫీసర్లు గురువారం ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లా తిరువూరులో మీటింగ్ నిర్వహించారు. మీటింగ్‌కు ఖమ్మం కలెక్టర్ వీపీ.గౌతమ్, ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా, ఖమ్మం సీపీ సునీల్‌దత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆఫీసర్లు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఇరు రాష్ట్రాల ఆఫీసర్లు కో ఆర్డినేషన్‌తో పనిచేయాలని నిర్ణయించారు.
ఖమ్మం కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఏపీ ఆఫీసర్లు పూర్తిగా సహకరించారని అభినందించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం, విలువైన వస్తువులు రవాణా జరగకుండా అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద నిరంతరం తనిఖీ చేపట్టాలని సూచించారు.