భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గ్రీవెన్స్ లో వచ్చిన అప్లికేషన్ల పరిష్కారానికి ఆఫీసర్లు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని కలెక్టర్ ప్రియాంక అలా ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్నిర్వహించారు. ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ప్రజలు ఆశతో తమ సమస్యలు పరిష్కారం కోసం వచ్చే ప్రజలను ఆఫీసర్లు నిర్లక్ష్యం చేయొద్దన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీసీలో ఆమె మాట్లాడుతూ ఇల్లెందు మండలంలోని సీఎస్పీ బస్తీలో తాము ముప్పయేళ్లుగా నివసిస్తున్నామని, తమ భూములకు పట్టాలున్నాయని, జేకే–5ఓసీ ఏర్పాటుతో తాము జీవనోపాధి కోల్పోతున్నామని బస్తీకి చెందిన రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు
. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అనంతరం తల్లిపాల వారోత్సవాల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. మంగళవారం నుంచి ఏడో తేదీ వరకు వీటిని నిర్వహిస్తామన్నారు. ప్రోగ్రాంలో అడిషనల్కలెక్టర్లు వెంకటేశ్వర్లు, మధుసూదనరాజు, మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారి సబిత, డీఆర్డీవో మధుసూదనరాజు, జడ్పీ సీఈవో విద్యాలత, డీఎంహెచ్ఓ శిరీష, హాస్పిటల్స్కోఆర్డినేటర్రవిబాబు, ఆఫీసర్ విజేత పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌కు ప్రపోజల్స్..
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌కు ప్రతిపాదనలు ఇవ్వాలని కలెక్టర్ ప్రియాంక అలా ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ఆఫీసర్లను ఆదేశించారు. వారితో కలెక్టరేట్ నుంచి సోమవారం నిర్వహించిన వీసీలో ఆమె మాట్లాడారు. కేంద్రాల్లో మంచినీరు, టాయ్‌లెట్స్, ర్యాంప్లతోపాటు కరెంట్ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. సరైన సౌకర్యాలు లేని పోలింగ్ కేంద్రాలను ఆఫీసర్లు వ్యక్తిగతంగా పరిశీలన చేసి, పోలింగ్ కేంద్రాల వారీగా నివేదికలను అందించాలన్నారు.