మిర్యాలగూడ, వెలుగు : పర్మిషన్ లేకుండా చెరువు మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను ఆఫీసర్లు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల చెరువు నుంచి శుక్రవారం ఇటుక బట్టీలకు మట్టి తరలిస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు అందింది.
దీంతో అధికారులు ఫీల్డ్ ఎంప్లాయిస్‌ను అక్కడికి పంపించారు. వాళ్లు అక్కడికి వెళ్లి మట్టి తవ్వుతున్న జేసీబీలు, రవాణా చేస్తున్న 30 ట్రాక్టర్లను అడ్డుకున్నారు. కాగా, ఈ సమయంలో మట్టి రవాణా చేస్తున్న వ్యక్తులు ఫీల్ట్ ఆఫీసర్లతో కొద్ది సేపువా గ్వాదానికి దిగారు.