మరిపెడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలో శుక్రవారం మాజీ మంత్రి రెడ్యా నాయక్ కు చెందిన లక్ష్మీ పార బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీ పై స్టేట్ సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు దాడులు నిర్వహించారు. రూ.6కోట్ల 49 లక్షల33 వేల ధాన్యం మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించనందున, మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు. దాడుల్లో స్టేట్ సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్, డిస్టిక్ సివిల్ సప్లై మేనేజర్ కృష్ణవేణి, మరిపెడ తహసీల్దార్సైదులు, ఆర్ఐ శరత్ చంద్ర, ఎస్సై సతీశ్ తదితరులున్నారు.