ఖమ్మం టౌన్/ భద్రాద్రి కొత్తగూడెం : ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. నగరంలోని నయా బజార్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్ ఆర్ అండ్ బీజీ ఎన్ఆర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను పోలీసు కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు.
ఎం. వెంకటాయ పాలెం, తెల్దారుపల్లి, పిండిప్రోలు, కాచిరాజుగూడెం, ఖమ్మం నగరంలోని రమణగుట్ట, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజ్, వైరా, ఏన్కూరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెంలలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎస్పీ రోహిత్ రాజు కొత్తగూడెంతోపాటు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ పినపాక నియోజక కాస్టింగ్ ద్వారా జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్‌ను పరిశీలించారు.