మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనిది సూపర్ హిట్ కాంబోలో. ఈ ఇద్దరు కలిసి చేసిన డాన్ శ్రీను, బలుపు, క్రాక్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అందుకే రవితేజతో మరో సినిమా ప్లాన్ చేశాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు మొదలవకుండానే ఆగిపోయింది.
Make way for the biggest action film of the country - #SDGM 🔥
— Mythri Movie Makers (@MythriOfficial) June 20, 2024
Starring Action Superstar @iamsunnydeol 💪🏻
Directed by @megopichand 💥
Produced by @MythriOfficial & @peoplemediafcy ❤️🔥
MASS FEAST LOADING!
Shoot begins soon.@MusicThaman @RishiPunjabi5 @artkolla pic.twitter.com/hwsEji2X4a
అయితే.. ఇప్పుడు అదే కథని బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ కి చెప్పి ఒప్పించాడట దర్శకుడు గోపీచంద్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమాపై నేడు(జూన్ 20) అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలైన మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్నారు. తమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాను హిందీలో తెరకెక్కించి.. మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దర్శకుడు గోపీచంద్ మలినేని ఎలాంటి రిజల్ట్ అందుకోనున్నాడో చూడాలి.