తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లగచర్లలో ఏర్పాటు చేయాలకున్న ఫార్మా సిటీని రద్దు చేసిన విషయం తెలిసిందే.. అదే ప్రాంతంలో మల్టీపర్సస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించుకుంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం మల్టీపర్సస్ఇండస్ట్రియల్ పార్కు కోసం టీజీఐఐసీ ప్రతిపాదనల మేరకు తాండూర్ డివిజన్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌ను భూ సేకరణ అధికారిగా నియమిస్తూ కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల గ్రామాల పరిధిలో టీజీఐఐసీ డిపార్ట్మెంట్ద్వారా మల్టీ పర్పస్ఇండస్ట్రియల్పార్క్ నెలకొల్పడాని కి తాండూర్ డివిజన్ సబ్ కలెక్టర్/ భూ సేకరణ అధికారి గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేశారు. నవంబర్ 29న భూసేకరణకు అధికారికంగా కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.
లగచర్లలో ఫార్మా విలేజ్ల ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని లగచర్లతోపాటు హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజీ ఏర్పాటుకు 1,358 ఎకరాల భూసేకరణ కోసం ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకున్నది. అక్కడి ప్రజల అభిప్రాయం మేరకు ఫార్మా విలేజీలకు బదులుగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. రాబోయే ఇండస్ట్రియల్ పార్కులో టెక్స్టైల్, కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వనున్నట్టు తెలుస్తున్నది.