HYDRAA: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన హైడ్రా

గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హైడ్రా స్పీడ్ పెంచింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కమిషనర్ హైడ్రా పేరుతో ఎక్స్ అకౌంట్ ను   ప్రారంభించింది. అయితే గతంలో(2018) ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (EDVM)ఖాతానే  HYDRAA  గా మార్చినట్లు తెలుస్తోంది.

 దీనికి దాదాపు 53 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. హైదరాబాద్ లో  జూన్ 27 నంచి ఆగస్టు 24 వరకు కూల్చివేతలపై సర్కార్ కు రిపోర్ట్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది. కబ్జాదారుల నుంచి 43.94 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రిపోర్ట్ ఇచ్చింది. చెరువుల FTL, బఫర్ జోన్లతో పాటు పార్కు స్థలలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిలో పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులున్నారు. 

ALSO READ | కూపీ లాగుతోంది: FTL, బఫర్ జోన్ పరిధిలోని అనుమతులపై ఆరా..