- చెరువుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
- స్పష్టం చేసిన అధికారులు
- త్వరలో పలు చెరువులపై ఫైనల్ నోటిఫికేషన్
హైదరాబాద్, వెలుగు: హెచ్ఎండీఏ కమిషనర్చైర్మన్గా ఉన్న లేక్ ప్రొటెక్షన్కమిటీ చెరువుల పరిరక్షణకు కృషి చేస్తూనే ఉందని అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిటీ ఏర్పడిన నాటి నుంచి 2,540 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేశామని పేర్కొన్నారు. హె చ్ ఎండీఏ పరిధిలో మొత్తం 3,532 చెరువులకు 230 ఫైల్ నోటిఫికేషన్లు జారీ చేసినట్టు వెల్లడించారు. చెరువుల పరిరక్షణకు సంబంధించి పూర్తి ప్రాసెస్ నోటిఫికేషన్లు నవంబరు నాటికి జారీ చేస్తామని తెలిపారు.
రంగారెడ్డి, మేడ్చల్మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు. ఫైనల్ నోటిఫికేషన్ల జారీకి అడిషనల్ కలెక్టర్లు ప్రతి సోమవారం వీడియో కాన్ఫరెన్స్నిర్వహిస్తున్నారన్నారు. ప్రిలిమినరీ, ఫైల్ నోటిఫికేషన్ల జారీకి నోడల్అధికారులు, కోఆర్డినేటింగ్ అధికారులను నియమించినట్టు కూడా హెచ్ఎండీఏ ప్రకటించింది. ఈనెల 1 నుంచి 23 వరకు 60 చెరువులను సర్వే చేశామని, 83 చెరువులకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్లను ఆయా జిల్లాలు సమర్పించాయన్నారు. వీటి పై ప్రకటన చేసే ముందు స్క్రూటినీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు చెరువుల పరిరక్షణ పై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.