నర్సాపూర్/ నిజాంపేట/ బెజ్జంకి, వెలుగు: ఉమ్మడి మెదక్జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో రుణమాఫీ అర్హుల నిర్ధారణ కోసం అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. బుధవారం నజింపేట మండలంలోని బచ్చురాజ్పల్లిలో డీఏవో గోవింద్రైతుల వివరాలు సేకరించి, యాప్లో అప్లోడ్చేయడం ప్రారంభించారు.
నర్సాపూర్మండలంలోని రుస్తుంపేట, చిప్పలతుర్తి, జక్కపల్లి గ్రామాల్లో ఏడీఏ సంధ్య రాణి, మండల వ్యవసాయ అధికారి దీపిక, ఏఈవోలు సర్వే నిర్వహించారు. బెజ్జంకి మండలంలో నేటి నుంచి సర్వే నిర్వహిస్తామని ఏవో సంతోష్తెలిపారు.