పెద్దగట్టు జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నా అధికారులు

పెద్దగట్టు జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నా అధికారులు
  • ముస్తాబైన లింగమంతులస్వామి ఆలయం
  • ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం 
  • భక్తులకు వసతుల కల్పన పనులు షురూ
  • ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైవర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడీ  
  • వాహనాల పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 25 ఎకరాల స్థలం కేటాయింపు

సూర్యాపేట, వెలుగు : రాష్ట్రంలో రెండో అతిపెద్దదైన పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల 16 నుంచి 20 వరకు పెద్దగట్టు జాతర జరగనుంది. సూర్యాపేట జిల్లా పెద్దగట్టులో లింగమంతులస్వామి జాతర పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. మరో వారం రోజుల్లో జాతర ప్రారంభంకానుంది. ఈ జాతరకు 20 లక్షల మందికిపైగా భక్తులు రానున్నారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు.. 

పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.5 కోట్లతో రహదారుల మరమ్మతులు, గుట్టపై నుంచి వచ్చే మురుగునీరు వెళ్లేందుకు డ్రైనేజీల పనులు కొనసాగుతున్నాయి. గుట్టపై చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 21 శాఖల జిల్లా అధికారుల కోసం గుట్ట కింద పందిళ్లతో ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే ప్రముఖుల కోసం అతిథి గృహాన్ని సిద్ధం చేశారు. గుట్టపై ఎక్కడపడితే అక్కడ జంతుబలి చేయకుండా ప్రత్యేకంగా షెడ్డును నిర్మించారు. గుట్టపై జంతువుల రక్తాన్ని శుభ్రంచేసే యంత్రాన్ని సిద్ధం చేశారు. ప్రమాదకరంగా ఉన్న చెరువుకట్టకు కర్రలతో ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. తలనీలాలు సమర్పించిన భక్తులు స్నానం చేసేందుకు గుట్ట కింద కోనేరుతోపాటు గుట్టపైన షవర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న శాశ్వత మరుగుదొడ్లతోపాటు తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ప్రధానంగా పారిశుధ్యం, తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. 

రూట్ మ్యాప్ సిద్ధం చేసిన పోలీసులు..

పెద్దగట్టు జాతర సందర్భంగా ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇబ్బందులు తలెత్తకుండా సూర్యాపేట జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైవర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే సిద్ధం చేయగా, సోమవారం రూట్ మ్యాప్ విడుదల చేయనున్నారు. ఈనెల16న జాతర ప్రారంభంకానుండగా 16,17,18 తేదీల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై నుంచి వెళ్లే వాహనాలను నార్కెట్ పల్లి  మీదుగా దారి మళ్లించనున్నారు.  

పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థలాలు సిద్ధం..

జాతరకు వచ్చే భక్తుల కోసం పోలీసులు నాలుగు చోట్ల ప్రత్యేక పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థలాలను ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్​కోసం మొత్తం 25 ఎకరాలు సేకరించి చదును చేస్తున్నారు. సూర్యాపేట మీదుగా పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తుల వాహనాలు హైదరాబాద్ –విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రామకోటి తండాకు వెళ్లే మార్గంలో పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. గరిడేపల్లి, పెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి దురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి నుంచి వచ్చే భక్తుల వాహనాలను పాత కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యాలయం వెనుక కేటాయించిన స్థలంలో పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఏర్పాటు చేశారు. 

కోదాడ, మునగాల, గుంపుల నుంచి వచ్చే భక్తుల వాహనాలను కాశీంపేట గ్రామానికి వెళ్లే మార్గంలో పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. మోతె, చివ్వెంల నుంచి వచ్చే భక్తుల వాహనాలను మున్యానాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తండా (పెద్దగట్టు) వెనుక పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్థలం కేటాయించారు. జాతరకు వచ్చే వీఐపీ వాహనాలను పెద్దగట్టు తూర్పు మెట్లకు ఎదురుగా ఉన్న స్థలంలో పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏర్పాటు చేశారు.