హైవేకు భూసేకరణ పై కదలిక

హైవేకు భూసేకరణ పై కదలిక
  •     జిల్లాలో ఎన్​ హెచ్​ 163 జీ, 930పీ ఎన్​ హెచ్​ల నిర్మాణం
  •     సీఎం ఆదేశాలతో  అధికారులు అలెర్ట్

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్​ జిల్లాలో జాతీయ రహదారుల  భూ సేకరణ కోసం అధికారులు రెడీ అయ్యారు.  ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డి  కలెక్టర్​, ఇతర ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించి, ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఫీల్డ్​ విజిట్​ చేసి రైతులతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. దీంతో అధికారులు ఆ దిశగా  కసరత్తు చేస్తున్నారు. గతంలో ఆఫీసర్లు భూ సర్వే నిర్వహించినా పలు సమస్యలు ఎదురయ్యాయి.  

భూ రికార్డుల్లో  ఒకరి పేరుండగా.. సాగు మరొకరు చేస్తూ  ఉండటంతో అసలు రైతులకు కొంతమందికి నోటీసులు అందలేదు, మార్కెట్​ రేట్​ కంటే తక్కువ రేట్​ కోట్​ చేయడం, అసైన్డ్​ భూముల  విషయం తేలకపోవడంతో సేకరణలో ఆలస్యం ఏర్పడింది. 

జిల్లాలో ఎన్​హెచ్​ పనులు 

  •      జిల్లాలో ఆయా చోట్ల  ఎన్​ హెచ్​ 930 పీ  హైవే భూ సేకరణలో ఆలస్య ం జరిగింది. 
  • ఓఆర్​ఆర్​ గౌరెల్లి నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు నిర్మించే ఎన్​హెచ్​ 930 పీ పనులు 
  • మహబూబాబాద్​ జిల్లాలోని పెద్దవంగర, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్​  నుంచి  బయ్యారం మండలంలోని నామాలపాడు వరకు కొనసాగుతాయి. 
  •     సూర్యాపేట జిల్లా తిరుమలగిరి నుంచి మహబూబాబాద్​ జిల్లా పెద్దవంగర మండల కేంద్రం వరకు ఎన్​ హెచ్​ 930పీ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బ్రిడ్జీల పనులు మినహా మిగిలిన పనులు పూర్తయ్యాయి. 
  •     తొర్రూరు మండలం నుంచి బయ్యారం మండలంలోని నామాలపాడు వరకు 68.9 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం కోసం భూ సేకరణ పూర్తి కావాల్సి ఉంది.  దీని కోసం రూ.675.45 కోట్ల కేటాయించారు.  విద్యుత్​ స్థంబాల తొలగింపు, మిషన్​ భగీరథ పైపు లైన్లు మార్చడంపై  ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.  ఇటీవల ఆఫీసర్లు భూ సేకరణకు సంబంధించి సవరణ బహిరంగ ప్రకటన జారీ చేశారు.
  •     163జీ రహదారి కోసం 659.01 ఎకరాలు అవసరం ఉంది. నాగ్​పూర్​ నుంచి విజయవాడ వరకు ఎన్ హెచ్​ ఐ పరిధిలో నిర్మించే నాలుగు లైన్ల 163జీ, నేషనల్​ గ్రీన్​ ఫీల్డ్​ హైవే మహబూబాబాద్​ జి ల్లాలోని కేసముద్రం మండలం కోరు కొండ పల్లి గ్రామం నుంచి, ఇనుగుర్తి, నెల్లికుదురు,కురవి మండలాల ద్వారా డోర్నకల్​ మండలం వెన్నారం గ్రామం వరకు సుమారు 51 కిలో మీటర్ల  మేర ఉండనుంది.  దీని కోసం 18 గ్రామాల పరిధిలో 659.01 ఎకరాల భూ సేకరణ 
  • జరగాల్సి ఉంది. 

 పనులు స్పీడప్​ చేస్తున్నాం

జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ కోసం భూ సేకరణను వేగవంతం చేస్తున్నాం. ప్రభుత్వం ఆదేశాల మేరకు  రైతులకు నోటీసులను జారీ చేశాం. భూములు కోల్పోయే  రైతులకు రూల్స్​ ప్రకారం పరిహారాన్ని ఇస్తాం. రైతులందరితో మాట్లాడి భూమిని సేకరిస్తాం.   

- డేవిడ్​ , అడిషనల్​ కలెక్టర్​( రెవెన్యూ), మహబూబాబాద్​ జిల్లా