శంషాబాద్ ఎయిర్​పోర్టులో .. 1.8 కిలోల గోల్డ్ సీజ్

హైదరాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న1.8 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. తిరుచురాపల్లి నుంచి హైదరాబాద్​కు వస్తున్న వ్యక్తి నుంచి గురువారం  ఈ బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ  ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన గోల్డ్ విలువ సుమారు రూ.1.1 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.

ALSO READ: బాల్క సుమన్​తో ప్రాణహాని ఉంది : మద్దెల భవాని