సిర్పూర్ టీ సమీపంలో..పీడీఎస్ బియ్యం పట్టివేత

కాగజ్ నగర్, వెలుగు :  కాగ జ్ నగర్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్న  వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు.  సివిల్ సప్లై ఎన్​ఫోర్స్​మెంట్​ డీటీ  శ్రీనివాస్, సిర్పూర్ టీ పోలీసులు   గురువారం తెల్లవారు  3 గంటలకు  సిర్పూర్ టీ సమీపంలోని రైస్ మిల్లు కాలనీ వద్ద  వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో   25 క్వింటాళ్ల  రేషన్ బియ్యం దొరికాయి. బియ్యం లోడుతో సహా వాహనాన్ని  సీజ్  చేసి , బియ్యం తరలిస్తున్న  కాగజనగర్ కు చెందిన సయ్యద్ షహబాజ్,మండోరే పవన్ కల్యాణ్​పై  కేసు నమోదు చేసినట్టు  డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు.