బాసర అమ్మవారి లడ్డూ, ప్రసాదాల్లో  గోల్ మాల్.. పట్టుబడ్డ ఇద్దరు అధికారులు   

బాసర అమ్మవారి లడ్డూ, ప్రసాదాల్లో  గోల్ మాల్.. పట్టుబడ్డ ఇద్దరు అధికారులు   

నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయంలో ఇంటి దొంగల బాగోతం బయటపడింది. లడ్డు, పులిహోర ప్రసాదాల్లో గోల్ మాల్ చేస్తూ అధికారులు పట్టుబడ్డారు. గ్రామ స్థుల ఫిర్యాదుతో టికెట్ కౌంటర్లను పరిశీలించారు ఆలయ ఈఓ విజయరామారావు.

 కౌంటర్లలో చింపని టికెట్లు గుర్తించారు. వీటి ఆధారంగానే ప్రసాదాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు ఈవో.  గ్రామ పూజలో పాల్గొన్న పులిహోర బండిలో 690 ప్యాకెట్లు ఉండగా రిజిస్టర్ బుక్ లో మాత్రం 350 నమోదు చేశారు. అధికారుల కళ్లుగప్పి కొంతమంది సిబ్బంది తమ చేతివాటం చూపించారు.

దీంతో ప్రసాదాల ఇంఛార్జీ అధికారులపై ఈవో సీరియస్ అయ్యారు. ఇలాంటి అవకతవకలు మున్ముందు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.