నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ల మూసివేత

నాగార్జున సాగర్  క్రస్ట్ గేట్ల మూసివేత

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్​కు  వరద  తగ్గుతుండటంతో   అధికారులు బుధవారం డ్యాం క్రస్ట్​ గేట్లను  క్లోజ్​ చేశారు. మొన్నటి వరకు ఎగువ నుంచి  ఇన్​ఫ్లో భారీగా  ఉండటంతో ఈ నెల 5న క్రస్ట్​ గేట్లను ఓపెన్​ చేశారు.  బుధవారం ఉదయం 2  గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగించగా ఆ తరువాత మధ్యాహ్నం ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గ  డంతో మిగతా గేట్లను మూసేశారు.  వరద ఉధృతిని బట్టి  నీటి విడుదల చేపడుతామని  అధికారులు తెలిపారు.