చింతగూడలో 5 కోట్లు డంప్​ చేశారని సమాచారం

  • ఐటీ, ఈసీ ఆఫీసర్ల విస్తృత సోదాలు
  • జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అభ్యర్థి నగదుగా ప్రచారం 

గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా గుడిహత్నూర్‌‌‌‌‌‌‌‌ మండలంలోని చింతగూడలో ఐటీ, ఈసీ ఆఫీసర్ల సోదాలు స్థానికంగా సంచలనం రేపాయి. గ్రామంలో రూ.5 కోట్లు డంప్ ​చేశారని సమాచారంతో అధికారులు సోదాలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌లో పంచడానికి చింతగూడ గ్రామంలో సుమారు రూ.5 కోట్ల వరకు నేతలు డంప్‌‌‌‌‌‌‌‌ చేశారని సమాచారం అందుకున్న ఈసీ, ఐటీ అధికారులు శనివారం మధ్యాహ్నం గ్రామానికి చేరుకొని పోలీసుల సహకారంతో గ్రామాన్ని జల్లెడ పట్టారు.

అయితే సోదాల్లో ఎలాంటి నగదు దొరకలేదని ఆఫీసర్లు తెలిపారు. ఈ వార్త సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో విపరీతంగా వైరల్‌‌‌‌‌‌‌‌ అయింది. జిల్లాకు చెందిన ఓ నేతకు సంబంధించిన డబ్బుగా ప్రచారం సాగింది. అయితే, సోదాల్లో ఆఫీసర్లకు ఏమీ దొరకకపోవడం గమనార్హం. దాడుల్లో ఎన్నికల ఫ్లయింగ్‌‌‌‌‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌‌‌‌‌ తో పాటు ఎస్సై ఇమ్రాన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.