ఇబ్రహీంపట్నం, వెలుగు: ఓఆర్ఆర్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు నిర్మించనున్న ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం ప్రభుత్వం పనులు ముమ్మరం చేసింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్, మహేశ్వరం మండలం కొంగర కుర్దు గ్రామాల్లో అధికారులు బుధవారం సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వంసేకరిస్తున్న భూములకు మరోచోట భూములు ఇచ్చి భూసేకరణ చేయాలన్నారు. ఈ సర్వేలో రెవెన్యూ ఆర్ఐ పుష్పలత, సర్వేయర్ సాయిక్రిష్ణా రెడ్డి, వినోద్, ఎక్సైజ్ సీఐసీతారాం రెడ్డి, ప్రవీణ్, వ్యవసాయ శాఖ ఏఈ విద్యాధరి తదితరులు పాల్గొన్నారు.