లగచర్ల ఘటనపై .. కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగుల ధర్నా

  • లగచర్ల ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
  • అధికారుల‌‌‌‌‌‌‌‌పై దాడిని ఉపేక్షించొద్దన్న ఉద్యోగ సంఘాలు
  • పున‌‌‌‌‌‌‌‌రావృతం కాకుండా చ‌‌‌‌‌‌‌‌ర్యలు తీసుకోవాలి: చైర్మన్ ల‌‌‌‌‌‌‌‌చ్చిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: లగచర్ల ఘటన వెనుక ఎవరున్నా శిక్షించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్​ చేసింది. అధికారులపై దాడిని ఉపేక్షించొద్దని కోరింది. రాజకీయాలకు అతీతంగా సేవలు అందించే అధికారులపై దాడులు, హత్యాయత్నం వంటి ఘటనలకు పూనుకోవడం సరికాదని పేర్కొన్నది. లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడిని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క‌‌‌‌లెక్టరేట్ల ముందు ధ‌‌‌‌ర్నాలు చేపట్టారు. 

 అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చారు.  ఇందులో భాగంగా గురువారం హైద‌‌‌‌రాబాద్ క‌‌‌‌లెక్టరేట్ ముందు ఉద్యోగుల జేఏసీ చైర్మన్​ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు ధ‌‌‌‌ర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల‌‌‌‌పై దాడికి పాల్పడి, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల మాన‌‌‌‌సిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రప‌‌‌‌న్నిన నిందితుల‌‌‌‌ను వదిలిపెట్టొద్దని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘ‌‌‌‌ట‌‌‌‌న‌‌‌‌లు రాష్ట్రంలో  పున‌‌‌‌రావృతం కాకుండా చ‌‌‌‌ర్యలు తీసుకోవాల‌‌‌‌ని అన్నారు.  

తీవ్రంగా గాయపడిన అధికారులను ఎవరూ పరామర్శించలేదని, కొందరు దాడిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారని అన్నారు. కొందరు ల‌‌‌‌గచ‌‌‌‌ర్ల ఘ‌‌‌‌ట‌‌‌‌న‌‌‌‌లో దాడికి గురైన ఉద్యోగుల‌‌‌‌ను కాకుండా, దాడికి పాల్పడిన వారిని ప‌‌‌‌రామ‌‌‌‌ర్శించ‌‌‌‌డాన్ని ఆయ‌‌‌‌న త‌‌‌‌ప్పుబ‌‌‌‌ట్టారు. ఇది స‌‌‌‌రైన ప‌‌‌‌ద్ధతి కాద‌‌‌‌ని అన్నారు.   అనంత‌‌‌‌రం హైద‌‌‌‌రాబాద్ క‌‌‌‌లెక్టర్‌‌‌‌కు విన‌‌‌‌తిప‌‌‌‌త్రం స‌‌‌‌మ‌‌‌‌ర్పించారు. 

ఈ కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ నాయ‌‌‌‌కులు డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్   జనరల్ సెక్రటరీ కె.రామ‌‌‌‌కృష్ణ,  తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాములు,  తెలంగాణ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్​ జి.నిర్మల‌‌‌‌,  తెలంగాణ సీపీఎస్ యూనియన్  అధ్యక్షుడు  ద‌‌‌‌ర్శన్‌‌‌‌గౌడ్, టీడీఆర్ డీఏఓ అసోసియేషన్ అధ్యక్షుడు  సీహెచ్ రవి,  ఇతర ఆఫీసర్లు డా. కత్తి జనార్దన్, దేవికా , శ్రీరాం, హరికిషన్ , ఉదర గోపాల్, విజయారావు, సుగంధిని, హేమలత, రాబర్ట్ బ్రూస్, రోహిత్ నాయక్, మల్లేశ్​, త‌‌‌‌దిత‌‌‌‌రులు పాల్గొన్నారు.

దోషులను శిక్షించాలి: వంగ రవీందర్​

తెలంగాణా ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్ల జేఏసీ పిలుపు మేరకు ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి  అధ్యక్షతన  హైదరాబాద్​ సీసీఎల్​ఏ కార్యాలయంలో  గురువారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.  రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. లగచర్ల ఘటన ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని అన్నారు.  రైతుల ముసుగులో  గుండాలు దాడి చేశారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా  చూడాలన్నారు. 

వికారాబాద్ జిల్లాలో జరిగిన దాడితో ఉద్యోగులు తీవ్ర మనస్తాపం చెందుతున్నారని జేఏసీ సెక్రటరీ జనరల్, టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు అన్నారు. ఈ దాడి వెనుక కుట్ర కోణం ఉందనే విషయాన్ని గుర్తించి, ముందే సంబంధిత అధికారులకు తెలియజేశామని  ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్  తెలిపారు.  తెలంగాణ ఉద్యమం తరహాలో తెగువ, పోరాట స్ఫూర్తి మరోసారి చూపే సమయం ఆసన్నమైందని రాష్ట్ర టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేని అన్నారు.