కలెక్టర్ ​ఆదేశాలతో అక్రమ కట్టడాలు నేలమట్టం

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. మున్సిపాలిటీ పరిధిలోని చెరువుల కబ్జాలపై స్థానికులు కలెక్టర్​ శ్రీహర్షకు కంప్లైట్​ చేశా రు. స్పందించిన కలెక్టర్​ చెరువు ఆక్రమణలపై  అధికారులతో సర్వే చేయించారు.  

మున్సిపల్​ కమిషనర్​ నివేదిక ఆధారంగా బఫర్​ జోన్ లో  నిర్మాణాలను గుర్తించారు.  గురువారం (సెప్టెంబర్ 5, 2024) తెల్లవారుజాము నుంచి పట్టణంలోని  బంధంపల్లి, రంగంపల్లి చెరువు కబ్జాచేసి నిర్మించిన కట్టడాలను జేసీబీతో కూల్చివేశారు.