అమ్రాబాద్, వెలుగు: మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ సమీపంలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ ను అధికారులు కూల్చివేశారు. ప్రమాదకరంగా వాటర్ ట్యాంక్ శీర్షికతో వెలుగు దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.
మంగళవారం రాత్రి వరకు ట్యాంక్‌ను కూల్చేందుకు శ్రమించినా సాధ్యం కాలేదు. దీంతో బుధవారం ఉదయం ట్యాంక్ ను కూల్చేశారు. డీఈ హేమలత, ఏఈ సందీప్, సెక్రటరీ మల్లేశ్, గ్రామస్తులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.