- జిల్లాలోని 4 మండలాల్లో సర్వే చేస్తున్నఆఫీసర్లు
- ఆక్రమణకు గురైన ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ ల స్థలాలు
- సర్వే పూర్తయ్యాక ప్రభుత్వానికి తది నివేదిక
మెదక్, తూప్రాన్, వెలుగు: హైదరాబాద్నగర పరిధిలోని సాగునీటి వనరుల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రా ను ఏర్పాటు చేసి చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో ఉన్న నగర శివారు మండలాల్లో సైతం చెరువుల సర్వే చేపడుతున్నారు. జిల్లాలోని నర్సాపూర్, శివ్వంపేట, తూప్రాన్, మనోహరాబాద్ మండలాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఆయా మండలాల్లోని చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఎంత వరకు ఉందనేని నిర్దారించేందుకు సర్వే చేపడుతున్నారు. ఆయా మండలాల పరిధిలోని చెరువుల సర్వేకు తూప్రాన్, నర్సాపూర్ రెవెన్యూ డివిజనల్అధికారులు ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసి, ఏజెన్సీల ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నారు.
తూప్రాన్ మండలంలో మొత్తం 138 చెరువులు ఉండగా ఇదివరకు 93 చెరువులకు సంబంధించి, మనోహరాబాద్ మండలంలో 105 చెరువులకు గాను 77 చెరువులకు సంబంధించి ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఫైనల్నోటిఫికేషన్జారీ కోసం హెచ్ఎండీఏ వద్ద ఉన్న చెరువు మ్యాప్‌ల ఆధారంగా రెవెన్యూ, ఇరిగేషన్డిపార్ట్మెంట్లు సర్వే చేస్తున్నాయి. ఇప్పటి వరకు తూప్రాన్ మండలంలో 23, మనోహరాబాద్ మండలంలో 22 చెరువుల సర్వే పనులు కంప్లీట్అయ్యాయి.
మిగతా చెరువుల సర్వే కొనసాగుతోంది. తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి చెరువుల సర్వే పనులను పర్యవేక్షిస్తున్నారు. నర్సాపూర్ మండలంలో 164 చెరువులు, శివ్వంపేట మండలంలో 162 చెరువులు కలిపి మొత్తం 326 చెరువులు ఉండగా 311 చెరువులకు ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేశారు. బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ సర్వే పూర్తి చేశాక ఫైనల్నోటిఫికేషన్జారీ చేయనున్నారు. నాలుగు మండలాల్లో చెరువుల ఫైనల్సర్వే పూర్తయ్యాక ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. తదనుగుణంగా ఆయా చోట్ల గుర్తించిన ఆక్రమణలను తొలగించి చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నారు.
భూముల విలువ పెరగడంతో..
నర్సాపూర్, శివ్వంపేట, తూప్రాన్, మనోహరాబాద్ మండలాలు హైదరాబాద్నగరానికి సమీపంలో ఉన్నాయి. నేషనల్ హైవేలు ఉండడం, రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణం కానుండడంతో భూములకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి. రియల్ఎస్టేట్వ్యాపారులు అనేక ఎకరాల భూములు కొనుగోలు చేసి వెంచర్లు, ఫామ్ల్యాండ్వెంచర్లు ఏర్పాటు చేశారు. చాలా మంది భూములు కొనుగోలు చేసి ఫామ్‌హౌజ్ లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో చెరువులు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయి.
చెరువుల, కుంటల సమీపంలో భూములు కొనుగోలు చేసిన వారు బఫర్జోన్లను, ఎఫ్టీఎల్పరిధి స్థలాలను సైతం ఆక్రమించి తమ భూముల్లో కలిపేసుకున్నారు. కొన్ని చోట్ల చెరువుల, కుంటల శిఖంలో నిర్మాణాలు చేపట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. శివ్వంపేట మండలంలోని పలు గ్రామాల పరిధిలో చెరువు, కుంటలకు వెళ్లే దారులను సైతం కబ్జా చేశారు. ఇపుడు చేపడుతున్న సర్వేలో ఇలాంటి అక్రమాలు వెలుగు
చూడనున్నాయి.