హైవే ప్రమాదాల నివారణపై ఫోకస్

హైవే ప్రమాదాల నివారణపై ఫోకస్
  • హై వే 44 పై 3 చోట్ల వెహికల్ అండర్ పాస్ లు
  • 15 రోజుల్లో బ్రిడ్జి ల మీదుగా రాకపోకలు
  •  సదాశివనగర్ సమీపంలో మరో బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో హైవేల పై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధికారులు ఫోకస్​ చేశారు. ప్రమాదాల నివారణకు బ్రిడ్జీలను, అండర్​ పాస్​లను నిర్మించారు. జిల్లా మీదుగా వెళ్లే ఎన్​హెచ్​ 44 పై ఇప్పటికే ఆయా చోట్ల బ్రిడ్జిలు, అండర్​పాస్​లు సిద్ధం అయ్యాయి. మరో పది పదిహేను రోజుల్లో రాకపోకలు షురూ కానున్నాయి. జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు జిల్లా లో ప్రస్తుతం రూ. 100 కోట్లతో 3 పెద్ద బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోంది. 

హైవే నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రంలోకి ప్రవేశించే టెక్రియాల్, నర్శన్నపల్లి, పొందూర్తి , సదాశివ నగర్ మండలం పద్మాజీవాడి చౌరస్తా ల వద్ద వెహికిల్ అండర్ పాస్ బ్రిడ్జిల పనులు చివరి దశకు చేరాయి. మరో వారం  రోజుల్లో పద్మాజీవాడి బ్రిడ్జి మీదుగా వెహికిల్ రాకపోకలకు అనుమతించనున్నట్లు హై వే అధికారులు పేర్కొన్నారు. మిగతా 2 చోట్ల 15, 20 రోజుల్లో బ్రిడ్జి ల మీదుగా రాకపోకలు సాగే అవకాశం ఉంది.

ఎన్​హెచ్​ 44పై ప్రమాదాలకు చెక్​ .. 

కామారెడ్డి జిల్లా మీదుగా మూడు హైవేలు వెళ్తున్నాయి. ఇందులో కీలకమైన 44వ నంబర్ హైవే జిల్లాలో 46 కిలోమీటర్ల పొడవు ఉంది. వేలాది వాహనాల రాకపోకలు సాగుతాయి.  ఈ హైవే పై  గూడ్స్​ వెహికల్స్​ రద్దీ ఉంటుంది. దీంతో తరచు ప్రమాదాలు జరుగుతుంటాయి.  ఈ ప్రమాదాలను నివారించేందుకు  జంక్టన్ల వద్ద , వెహికల్ అండర్ పాస్ నిర్మాణం , యాక్సిడెంట్లు ఎక్కవ బ్లాక్ స్పాట్స్ గుర్తించి నివారణకు చర్యలు చేపడుతున్నారు. 

 రూ. 100 కోట్లతో 3 బ్రిడ్జీలు...

భిక్కనూర్ మండలం బస్వాపూర్ శివారు నుంచి సదాశివ నగర్ మండలం దగ్గి ఫారెస్ట్ ఏరియా వరకు కామారెడ్డి జిల్లాలో హైవే 44 వెళ్తోంది. భిక్కనూరు, బీటీఎస్, పొందుర్తి, కామారెడ్డి, టెక్రియాల, సదాశివనగర్, పద్మాజి వాడి వద్ద జంక్షన్లు ఉన్నాయి. ఈ జంక్షన్ల్ వద్ద వందలాది వాహనాలు అటు ఇటు రహదారి దాటుతుంటాయి. వీటి వద్ద వెహికల్స్ క్రాస్ అవుతూ యాక్సిడెంట్లు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోవడం, తీవ్రంగా  గాయపడిన సందర్భాలు ఉన్నాయి. 

సదాశివ నగర్ సమీపంలో త్వరలో మరోటి.. 

సదాశివ నగర్ మండల కేంద్రం సమీపంలోని జూనియర్ కాలేజీ, మోడల్ స్కూల్ కు దగ్గరగా మరో బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఇక్కడ లైట్ వెహికిల్ అండర్ పాస్ బ్రిడ్జి నిర్మిస్తారు. 
ఈ ఏరియాలో చాలా సార్లు ప్రమాదాలు జరిగాయి. బ్లాక్ స్పాట్ స్థానాల్లో యాక్సిడెంట్లు నివారణలో భాగంగా లైట్ వెహికిల్ అండర్ పాస్ బ్రిడ్జి కి ప్రతిపాదించారు. డీపీఆర్ కూడా ఉన్నతాధికారులకు పంపారు. ప్రమాదాలు ఎక్కవగా జరిగే దగ్గి, కల్వరల్, మల్లుపెట్, మార్కల్, అడ్లుర్ ఎల్లారెడ్డి వద్ద సర్వీస్ రోడ్డు అభివృద్ధి, లైటింగ్ ఏర్పాటు, ప్రమాదాల హెచ్చరిక బోర్డుల ఏర్పాటు చేస్తున్నారు.