డాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చర్యలు .. బ్లూ క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థతో అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ?

  • ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 1600, పట్టుకున్నందుకు రూ. 250
  • యాదాద్రి జిల్లాలో 30 వేల డాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నట్లు గుర్తింపు

యాదాద్రి, వెలుగు : కుక్క కాటు బాధితులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో వాటి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా కుక్కల సంఖ్యను లెక్కించిన అనంతరం వాటికి బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్లు చేయించాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ఇందుకోసం బ్లూ క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థతో అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

యాదాద్రి జిల్లాలో 30 వేలు...

యాదాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న కుక్కల సంఖ్య తేల్చేందుకు పంచాయతీ, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బంది రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో మొత్తం 30 వేల కుక్కలు ఉన్నట్టు తేల్చారు. వీటిలో 421 గ్రామ పంచాయతీల్లో 27,025 ఉన్నాయి. నారాయణపురం మండలంలోని సర్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 400లకు పైగా ఉండగా, అదే మండలంలోని పుట్టపాకలో 300 వరకు ఉన్నాయి. అతి తక్కువగా వలిగొండ మండలం నర్సిగూడెంలో పదిలోపే ఉన్నాయని గుర్తించారు. జిల్లా కేంద్రమైన భువనగిరిలో వెయ్యికిపైగా ఉండగా, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భూదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోచంపల్లి, మోత్కూరు మున్సిపాలిటీల్లో ఒక్కో చోట 400కుపైగా డాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. 

ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 4.80 కోట్లు

కుక్కలకు బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. జిల్లాలో మేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీ అయిన భువనగిరిలోని స్టెరిలైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇటీవల 90 కుక్కలకు ఆపరేషన్లు చేయించారు. మిగిలిన ఐదు మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడినవి కావడం, నిధుల లేమి కారణంగా ఆపరేషన్లు చేయడానికి బ్లూ క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థతో అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నారు. అయితే ఒక్కో కుక్కకు ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు బ్లూ క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ రూ. 1600 డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం కుదిరితే యాదాద్రి జిల్లాలోని 30 వేల కుక్కలకు ఆపరేషన్లు చేయించాలంటే రూ. 4.80 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అదే విధంగా ఒక్కో కుక్కను పట్టుకునేందుకు రూ. 250 నుంచి రూ.300 వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత వారం రోజుల పాటు వాటి సంరక్షణకు సైతం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియంత్రణకు చేయాల్సిన ఖర్చుపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం ఎంత మొత్తం భరిస్తుందో స్పష్టత లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీకి తప్ప మరో మున్సిపాలిటీ గానీ, గ్రామ పంచాయతీ గానీ ఈ భారం మోయలేని స్థితిలో ఉన్నాయి.

జిల్లాలో 1,146 మందికి కుక్కకాటు

యాదాద్రి జిల్లాలో కుక్క కాటు బాధితులు పెరిగిపోతున్నారు. ప్రతి రోజు ఎక్కడో చోట కుక్కల దాడి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు 1,146 మందిని కుక్కలు గాయపరిచాయి. వీరంతా ప్రభుత్వాస్పత్రుల్లో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించుకున్నారు. ఇక ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్న వారి సంఖ్యలో లెక్కలో లేదు.