ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. వారి పాస్‌పోర్టులు రద్దు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. వారి పాస్‌పోర్టులు రద్దు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. SIB మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్టులను అధికారులు రద్దు చేశారు.

వీరిద్దరూ అమెరికాలో తలదాచుకున్నారని.. పాస్ పోర్టులు రద్దు చేయాలని పోలీసులు పాస్ పోర్ట్ ఆఫీస్ కు గతంలో లేఖ రాశారు. పోలీసుల నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పాస్ పోర్టులు రద్దు చేశారు. ఇప్పటికే వీరిద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.