కాప్రా సర్కిల్ జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. చర్లపల్లి డివిజన్లో అక్రమంగా నిర్మించిన భారీ షెడ్ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారుల ఆదేశాల మేరకు జేసీబీ సహాయంతో సిబ్బంది కూల్చివేశారు. ప్రతి డివిజన్ లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా..అధికారులు పట్టించుకోవడం లేదని, నోటీసులు జారీ చేశామని చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలు చేపట్టద్దని టౌన్ ప్లానింగ్, సెక్షన్ అధికారులు నోటీసులు జారీ చేసినా నిర్మాణదారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అక్రమ నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.