మాకు తెలియకుండా నిధులు మళ్లిస్తున్నరు: సర్పంచ్

కరీంనగర్ జిల్లా చెల్పూరు గ్రామ పంచాయతీ నిధులను అధికారులు డైవర్ట్ చేశారని సర్పంచ్ మహేందర్ గౌడ్ ఆరోపించారు. డిజిటల్ కీ సహాయంతో పంచాయతీ అధికారులు సురేందర్,  రాజేందర్ నిధులను డైవర్ట్ చేశారని సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సంతకాలను ఫోర్జరీ చేసి పంచాయతీ అకౌంట్లోని డబ్బులను డ్రా చేశారన్నారు. 

తన సంతకానికి డిజటల్ కీ ఇప్పించడంతో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలని మహేందర్ డిమాండ్ చేశాడు. అయితే ఫిర్యాదును పోలీసులు తీసుకోకపోవటంతో రిజిస్టర్ పోస్టులో కంప్లైట్ ను పంపినట్లు తెలిపాడు. డిజిటల్ కీ సహాయంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీ నిధులను ప్రభుత్వం డైవర్ట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.