కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు
  • ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోలకు శిక్షణ పూర్తి 
  • రేపు పంచాయతీల ఆర్వోలకు ట్రైనింగ్  
  • ఎంపీటీసీ స్థానాల పరిధిలోని ఓటరు జాబితాల ప్రదర్శన 
  • ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో పంచాయతీ ఓటర్లు 18,77,570 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/రాజన్నసిరిసిల్ల, వెలుగు: ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలతోపాటు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఆర్వోలకు శిక్షణ ఇస్తున్నారు. నాలుగు జిల్లాల్లో ఎన్నికలకు అవసరమైన స్టేషనరీ, పోల్ స్లిప్పులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామగ్రిని సమకూర్చేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించే ఉద్యోగులకు మంగళవారం శిక్షణ పూర్తయింది. సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించే ఆర్వోలకు గురువారం ట్రైనింగ్ ఇవ్వనున్నారు.  

గ్రామాల్లో ఓటరు జాబితా ప్రదర్శన.. 

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల పరిధిలోని ఓటరు ముసాయిదా జాబితాను సోమవారం అన్ని గ్రామపంచాయతీల్లో అధికారులు ప్రదర్శించారు. వీటిపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరించేందుకు 13వ తేదీ వరకు గడువు విధించారు. రాజకీయ పార్టీల నాయకులతో 13న సమావేశం నిర్వహించి సూచనలు తీసుకుంటారు. వచ్చిన ఫిర్యాదులను 14న ప్రదర్శిస్తారు. అనంతరం కలెక్టర్ అనుమతి తీసుకుని 15న తుది ఓటరు జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల చేస్తారు.  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుపై, సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు పార్టీయేతర సింబల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 
నిర్వహించనున్నారు. 

జగిత్యాలలో అత్యధికంగా గ్రామీణ ఓటర్లు.. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో  1,229 గ్రామపంచాయతీలు, 649 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మొత్తం 18,77,570 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 385 జీపీలు, 3,536 వార్డులు, 216 ఎంపీటీసీలు, 6,09,496 మంది ఓటర్లు ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో 318 జీపీలు, 2,962 వార్డులు, 170 ఎంపీటీసీలు, 5,08,489 మంది ఓటర్లు, పెద్దపల్లి జిల్లాలో 266 జీపీలు, 2,486 వార్డులు, 140 ఎంపీటీసీలు, 4,13,306 మంది,  రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 పంచాయతీలు, 2,268 వార్డులు, 123 ఎంపీటీసీలు, 3,53,796మంది ఓటర్లు ఉన్నారు.  

రిజర్వేషన్లపై ఉత్కంఠ

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలతోపాటు సర్పంచ్ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన నేఫథ్యంలో బీసీ కులాలకు చెందిన లీడర్లు రెడీ అవుతున్నారు.ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జుల చుట్టూ తిరుగుతున్నారు. రిజర్వేషన్ కలిసొస్తే తాను లైన్ లో ఉంటానని ముందుగానే చెప్పి పెడుతున్నారు.