హైదరాబాద్ వెలుగు : రిపబ్లిక్ డేకు భాగ్యనగరం ముస్తాబైంది. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. సిటీలోని అసెంబ్లీ, చార్మినార్, సెక్రటేరియట్, రైల్వే స్టేషన్లతోపాటు ప్రముఖ భవనాలు శనివారం రాత్రి మువ్వన్నెల కాంతులతో శోభాయమానంగా మారాయి.
అలాగే శనివారం పలు ప్రాంతాల్లో తిరంగార్యాలీలు నిర్వహించారు. భారత మాత హారతి కార్యక్రమంలో భాగంగా ర్యాలీ అనంతరం నెక్లెస్‌రోడ్‌లో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు పూజలు చేశారు.