
హైదరాబాద్, వెలుగు: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్షెడ్యూల్ను అధికారులు రిలీజ్ చేశారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7 వరకూ కౌన్సెలింగ్ప్రాసెస్ ఉంటుందని తెలిపారు. 30న ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉంటుందని, అక్టోబర్ 1న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. అక్టోబర్ 1, 2 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని, 4న సీట్ల అలాట్మెంట్ ఉంటుందని చెప్పారు. సీట్లు పొందిన అభ్యర్థులు 5లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, 7వ తేదీలోగా కాలేజీలో రిపోర్టింగ్ చేయాలని సూచించారు