నాంపల్లి నుమాయిష్ సందర్బంగా మెట్రో టైమింగ్స్ను పొడిగించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు అర్ధరాత్రి 12 గంటల వరకు రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు చివరి మెట్రో రైలు ప్రారంభమై ఒంటిగంట వరకు గమ్యస్థానానికి చేరుకోనున్నాయి. ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో సమయం పొడిగించారు. గాంధీ భవన్ మెట్రో స్టేషన్‌లో టికెట్ బుకింగ్ కౌంటర్ల సంఖ్యను 6కు పెంచినట్లు అధికారులు తెలిపారు.
జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు జరగనుంది. ఇందులో 1,500 మంది ఎగ్జిబిటర్లు 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఎంట్రీ టికెట్ ధరను రూ.40గా నిర్ణయించారు. ఐదేండ్ల లోపు పిల్లలను లోపలికి ఉచితంగా అనుమతిస్తారు. రోజూ మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10.30 వరకు సందర్శకులకు అనుమతిస్తారు. ఎగ్జిబిషన్ జరిగే రోజుల్లో నాంపల్లి గ్రౌండ్స్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.